మార్చి 28న ‘మేజర్’ మూవీ టీజర్

556
Major Glimpse | Major Teaser on 28th March | Adivi Sesh | Sobhita | Saiee Manjrekar | Mahesh Babu
Major Glimpse | Major Teaser on 28th March | Adivi Sesh | Sobhita | Saiee Manjrekar | Mahesh Babu

26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో టైటిల్ రోల్ ను అడివి శేష్ పోషిస్తుండగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీశర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్ బర్త్ డే సందర్భంగా వచ్చిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా మూవీని జూలై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

 

తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా మార్చి 28న ‘మేజర్’ మూవీ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రిన్స్ మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సందీప్ ఉన్నికృష్ణన్ మరణాన్ని మాత్రమే కాకుండా అతను జీవించిన విధానాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మహేశ్ బాబుకు చెందిన జిఎంబీ ఎంటర్ టైన్మెంట్, ఏప్లస్ ప్లస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది.