‘Major’ హిందీ శాటిలైట్ రైట్స్..!

0
43
Major Hindi satellite rights sold at a huge price

Adivi Seh Major: మొదటి నుంచీ కూడా అడివి శేష్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. లేటెస్ట్ మూవీ ”మేజర్”. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు – హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని అంటున్నారు. కరోనా తీవ్రత తగ్గడం వలన, మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మరియు శాటిలైట్ హక్కుల కోసం ఫాన్సీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘మేజర్’ ఓవర్ సీస్ రైట్స్ మంచి ధరలకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో హిందీ శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

‘మేజర్’ సినిమా ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందుతోంది. కథానాయకుడితో నడిచే పాత్రల్లో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కనిపించనున్నారు. కీలకమైన పాత్రలను ప్రకాశ్ రాజ్ .. రేవతి పోషిస్తున్నారు.

మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ”మేజర్” చిత్రాన్ని నిర్మిస్తోంది.