Sai Dharam Tej: ‘రిపబ్లిక్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్..!

0
30
Makers announce Sai Dharam Tej Republic single with an interesting video

Sai Tej Republic : మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ఈ మూవీకి ‘ప్రస్థానం’ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా (Deva Katta) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ (First Look Poster) – మోషన్ పోస్టర్ – టీజర్ (Teaser) విశేష స్పందన తెచ్చుకున్నాయి. సందేశాత్మక అంశాలతో కూడిన సినిమాని చూడబోతున్నామని హింట్ ఇచ్చాయి. ఈ క్రమంలో మరో అప్డేట్ తో మేకర్స్ ముందుకొచ్చారు.

రిపబ్లిక్ (Republic) సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ (First Single Song) ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ పేరుతో ఓ చిన్న అనౌన్సమెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ దేవా కట్టా, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలతో పాటు లిరిసిస్ట్ రెహమాన్ ఇందులో కనిపిస్తున్నారు. రెహమాన్ సాహిత్యం రాసుకొని వచ్చిన తర్వాత మణిశర్మ ఈ పాత్రకు ట్యూన్ కంపోజ్ చేయడం గమనార్హం. ‘హేయ్ రారో.. హేయ్ రారో..’ అంటూ సాగే ఈ యూత్ ఫుల్ సాంగ్ ని జూలై 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

‘గానా ఆఫ్ రిపబ్లిక్’ పాటను అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హైమత్ మహ్మద్, ఆదిత్య అయ్యంగర్, పృథ్వీ చంద్ర కలసి పాడారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. రిపబ్లిక్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో, జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో జె.భగవాన్, జె.పుల్లారావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.