బీహార్‌లో టీచర్ కాబోతున్న అనుపమ..? షాకిచ్చిన బీహార్ ప్ర‌భుత్వం

Anupama Parameshwaran: మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌న్‌కు బీహార్ ప్ర‌భుత్వం అనుకోని షాక్ ఇచ్చింది. ఇంత‌కీ అనుప‌మ‌కు, బీహార్ ప్ర‌భుత్వానికి సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా? ఆమెకు బీహార్ గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చిన షాకేంటి? అనే వివ‌రాల్లోకెళ్తే.. అనుపమ పరమేశ్వరన్ బీహార్‌లో టెట్ పరీక్ష రాసింది. మంచి మార్కులతో ఆమె పాసయింది. ప్రస్తుతం అనుపమ టెట్ మార్కుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రీసెంట్‌గా బీహార్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో రిషికేశ్ కుమార్ అనే వ్య‌క్తి 77 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాడు. కానీ స్కోర్ కార్డులో అత‌ని ఫొటోకు బ‌దులు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫొటో వ‌చ్చింది. నిజానికి రిషికేశ్‌ అడ్మిట్ కార్డుపై కూడా అనుప‌మ ఫొటో వ‌చ్చింది. అప్పుడత‌ను విద్యాశాఖాధికారుల‌ను సంప్ర‌దిస్తే..త‌ప్పును స‌రిచేస్తామ‌న్నారు. కానీ స‌రిచేయ‌లేదు. రిషికేశ్‌..స‌రేన‌ని అనుకుని ఎగ్జామ్ రాశాడు.

కానీ మార్క్ షీట్‌లో రిషికేశ్ ఫొటో లేదు. తన ఫొటోకు బదులు అనుపమ పరమేశ్వరన్ ఫొటో ఉండడంతో అతడు షాక్ తిన్నాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని రిషికేశ్ ఆరోపించాడు. ఐతే అతడి మార్కుల మోమో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. బీహార్ విద్యాశాఖ తీరుపై విమర్శలు రావడంతో.. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఈ తప్పిదంపై దర్యాప్తునకు ఆదేశించామని బీహార్ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles