Homeరివ్యూస్ఏకపక్షంగా సాగుతున్న ఏజ్ బార్ లవ్ స్టోరీ మళ్లీ పెళ్లి రివ్యూ..!!

ఏకపక్షంగా సాగుతున్న ఏజ్ బార్ లవ్ స్టోరీ మళ్లీ పెళ్లి రివ్యూ..!!

Malli Pelli Movie Review, Malli Pelli Movie Review in telugu, Malli Pelli Telugu Movie Review, Naresh, Pavithra Lokesh, Malli Pelli review & rating, Telugu movie reviews

ఎవరైనా బయోపిక్ ని వేరే వాళ్ళు తీస్తారు.. కానీ ఏమాత్రం మొహమాటం లేకుండా తమ స్టోరీని తానే బయోపిక్ రూపంలో తీయడం కాకుండా ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన ఘనత మాత్రం నరేష్ మరియు పవిత్ర లోకేష్ లకే దక్కుతుంది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ ఏజ్ బార్ లవ్ స్టోరీకి ఎక్స్టెన్షన్ గా వచ్చిన ఈ మళ్లీ పెళ్లి చిత్రం ఎలా ఉందో చూద్దాం.

Malli Pelli Movie Review & Rating: 2/5 – తారాగణం: నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, – దర్శకత్వం: ఎమ్మెస్ రాజు – సంగీతం: సురేష్ బొబ్బిలి, అరుళ్ దేవ్ – నిర్మాత: నరేష్.

కథ: నరేంద్ర (నరేష్) ఒక ఫేమస్ యాక్టర్. అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు అయి విడాకులు కూడా పూర్తి అయ్యాయి. ప్రజెంట్ అతను మూడవ భార్య సౌమ్యా సేతుపతితో (వనిత విజయ్ కుమార్)ఇష్టం లేని జీవితం గడుపుతుంటాడు. క్షణం కూడా పొసగక పోయినా ఆమె కేవలం అతని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అన్న విషయం నరేంద్ర తెలుసుకుంటాడు.

అదే సమయంలో అతనికి పార్వతి (పవిత్ర లోకేష్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె నరేష్ తో కలిసి పని చేసే ఫిలిం యాక్టర్. క్రమంగా ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. తనతో జీవితం సాఫీగా ప్రశాంతంగా ఉంటుంది అని భావించిన నరేంద్ర.. పార్వతి ఆమె భర్తతో ఎంతో హ్యాపీగా ఉన్నాను అని చెప్పడంతో తన మనసులో ఫీలింగ్స్ చెప్పకుండా ఆగిపోతాడు. అయితే ఆ తర్వాత పార్వతి నుంచి వచ్చిన మెసేజ్ నరేంద్రను డైలమాలో పెడుతుంది. ఇక అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది. అయితే ఆ మెసేజ్ ఏంటి? నరేంద్ర పార్వతి లపై సౌమ్య ఎటువంటి ఎత్తుగడలు వేస్తుంది తుదికి ఇద్దరి ప్రేమ మజిలీకి ఎలా చేరుతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ: ఎంత పేర్లు మార్చిన.. ఇది మా స్టోరీ కాదు అని స్టేట్మెంట్లు ఇచ్చిన.. మళ్లీ పెళ్లి చిత్రం కచ్చితంగా నరేష్ పవిత్రాల మధ్య జరిగిన ముదురు ప్రేమ కథ చిత్రం అని ఇట్టే అర్థమయిపోతుంది. ఈ వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని తానేమో సాధిస్తున్నానని నిరూపించుకోవడానికి నరేష్ పవిత్ర పడ్డ తాపత్రయం తప్ప సినిమాలో పెద్ద కంటెంట్ అయితే ఏమీ లేదు. చాలా వరకు సినిమాని వాస్తవికంగా వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మధ్య తీశారు.

పైగా నరేష్ మూడవ భార్య పాత్రను బాగా నెగిటివ్గా చూపించి ఆ మీద పెద్ద విలన్ అన్నట్లు హైలెట్ చేశారు. అంటే ప్రస్తుతం నరేష్ మూడో భార్య వల్ల టార్చర్ పడుతున్నాడు కాబట్టి పవిత్ర లోకేష్ తో పెళ్లికి సిద్ధపడుతున్నాడు అని ఓ రకంగా ప్రేక్షకుల బ్రెయిన్ ని హేప్నోటైజ్ చేసే ఉద్దేశం లాగే ఇది కనిపిస్తుంది. టెక్నికల్ గా చూస్తే నరేష్ ఈ చిత్రం మీద బాగా ఇన్వెస్ట్ చేసి చాలా రిచ్ గా తీశాడు అని అర్థమవుతుంది.

- Advertisement -

పాటలు కాస్త వీక్ గా అంత చెప్పుకోదగిన విధంగా లేవు. అయితే ఎమ్మెస్ రాజు డైరెక్షన్ కాబట్టి కథనం మంచి పట్టుతో సాగింది. లాస్ట్ లో కాస్త సాగదీతగా అనిపించిన మొత్తానికి సినిమా గ్రిప్టింగా ఎక్కడా బోర్ లేకుండా సాగింది అని చెప్పవచ్చు. నరేష్ మరియు పవిత్ర మీద గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఉన్న ఇంపాక్ట్ మనసులో పెట్టుకొని చూస్తే మాత్రం ఈ సినిమా పెద్ద నచ్చకపోవచ్చు కానీ వాళ్ళిద్దరిని కేవలం క్యారెక్టర్స్ గా భావించి చూస్తే ఈ సినిమాలో కంటెంట్ ఓకే అని చెప్పవచ్చు.

పవిత్ర టీనేజ్ క్యారెక్టర్ ను అనన్య నాగవల్లి పోషించడంతో ఆ సిచువేషన్ వరకు కాస్త గ్లామరస్ టచ్ వచ్చింది. మరోపక్క జయసుధ శరత్ బాబు జంట విజయనిర్మల కృష్ణ జంటను తలపించారు. చాలా లంకి బయోపిక్ ని చిన్ని ఎపిసోడ్స్ గా కట్ చేసి మధ్యలో బాగా ప్యాచ్ వర్క్ చేసి సినిమాగా తీశారు. ఈ మూవీలో వనితాసేతుపతి నరేష్ మధ్య సీన్స్, పవిత్ర కు ఓ రైటర్ తో ఉన్న లివింగ్ రిలేషన్…ఆ తర్వాత నరేష్ పవిత్ర మధ్య లవ్ ట్రాక్…కొంతవరకు ఆసక్తికరంగానే తెరకెక్కించారు.

Malli Pelli Telugu Movie Review

ప్లస్ పాయింట్స్:

నరేష్ మరియు పవిత్ర తమ క్యారెక్టర్స్ లోనే నటించారు కాబట్టి యధావిధి ఇందులో జీవించారు.

ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య జరుగుతున్న ప్రేమాయణం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవ్వడం ఓ రకంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.

అసలు సినిమాలో ఏముంది ఇది నిజంగా వీరి బయోపిక్ గా అన్న డౌట్ తో సినిమాకి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అని చెప్పవచ్చు.

మూవీ కాస్త గ్రిప్పింగ్ గా ఉంది.

మైనస్ పాయింట్స్:

అక్కడ అక్కడ సినిమా బోరింగ్ గా ఉంది.

ఓ రకంగా నరేష్ తన వెర్షన్ ను ప్రేక్షకుల ముందు ఉంచినట్లుగా కనిపిస్తుంది.

సినిమాలో పెద్ద కొత్తదనం ఏమీ లేదు.

బాటమ్ లైన్: రియాలిటీ అంతా అనే విషయాన్ని పక్కన పెట్టి.. గత కొద్దిరోజులుగా వివాదాస్పదంగా నడుస్తున్న నరేష్ పవిత్ర మధ్య ఉన్న సంబంధం గురించి క్యూరియాసిటీ ఉన్నవాళ్లు క్లారిటీ కోసం అయితే ఈ మూవీ ని చూడవచ్చు.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY