Malli Pelli OTT Release Date: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఊహించని మలుపులు ఎదురవుతాయి. అనుకోని ఎదురు దెబ్బలు తగులుతాయి. అయితే వాటన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఇక ఏం చేయాలని అనుకునే సందర్భంలో కొన్ని సార్లు మనకు జీవితం మరో అవకాశాన్ని కల్పిస్తుంది.
Malli Pelli Streaming Date: ఆ సందర్భంలో మనం కోరుకునే ప్రేమ మరో రూపంలో ఎదురవుతుంది. అయితే దాన్ని పొందే క్రమంలో సవాళ్లను, ఇబ్బందులుంటాయి. జీవితంలో అలాంటి భిన్నమైన కోణాలను ఆవిష్కరించే వైవిధ్యమైన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. జూన్ 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఆడియెన్స్‌కు ఓ భావోద్వేగ ప్రయాణంగా ప్రేక్షకుల కోరుకునే మంచి కథతో వారిని కట్టిపడేస్తుంది.
Malli Pelli OTT Release Date: ‘మళ్ళీ పెళ్లి’ సినిమా విషయానికి వస్తే.. నరేంద్ర (నరేష్) తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుడు. అతనికి పేరు, డబ్బు, హోదా అన్నీ ఉంటాయి. కానీ మానసిక ప్రశాంతత ఉండదు. ఆ జర్నీలో తనని తాను అన్వేషించుకుంటుంటాడు. జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ భార్య అతనితో గొడవ పడుతుంటుంది.
దాని వల్ల అతను మానసిక ప్రశాంతత, ప్రేమ కోసం అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి పార్వతి (పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. అది క్రమంగా వారి మధ్య మంచి అనుబంధంగా మారుతుంది. అయితే అనుకోని కారణాలతో వారి బంధం మీడియా దృష్టికి వెళ్లటంతో వారు ఇబ్బంది పడతారు. కలత చెందుతారు. ప్రేమతో నిండిన వారి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దాన్ని వారెలా అధిగమించారనేదే కథాంశం.
నరేష్, పవిత్రా లోకేష్ వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు జీవితంలో ప్రేమ, ఎదురయ్యే సవాళ్లు, జీవితం సాఫీగా, సంతోషంగా ఉండటానికి మనుషులు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాలను ‘మళ్ళీ పెళ్లి’ చిత్రంలో ప్రస్తావించారు. ఇందులో చక్కటి భావోద్వేగాలున్నాయి. తప్పకుండా ప్రేక్షకులు కోరుకునే అంశాలతో సినిమా ఆకట్టుకుంటుంది.