అఖిల్ సినిమాలో మెగాస్టార్.. భారీ రెమ్యునరేషన్..!

0
85
Mammootty remuneration details for Akhil Agent Movie

Akhil Agent – Mammootty: ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరక్కేక్కిన ఈ సినిమా షూటింగ్ క్లామాక్స్ లో ఉంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే (Pooja Hedgde) హీరోయిన్ గ నటిస్తుంది. అఖిల్ తన తర్వాతి చిత్రమైన ‘ఏజెంట్’ (Agent) ను సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

ఈ ‘ఏజెంట్’ (Agent) సినిమాలో అఖిల్ (Akhil) చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైన మలయాళం హీరో మ‌మ్ముట్టికి (Mammootty) ఏకంగా రూ.3 కోట్లు ఆఫర్ చేసాడట. ఇప్పటికే మమ్ముటి తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందట… సినిమా చేయడానికి మమ్ముట్టి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తుంది.

నిజానికి మమ్ముట్టి హవా ఈ మధ్య కాలంలో చాలా తగ్గింది. అయినప్పటికీ మలయాళంలో ‘ఏజెంట్’ కు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని.. మమ్ముట్టికి అంత ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం కోసం.. తమిళ్ నుండీ బాలీవుడ్ నుండీ కూడా పెద్ద నటీనటులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Huge Remuneration to Mammootty for Akhil Agent

చివరగా మమ్ముట్టి (Mammootty) తెలుగులో వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో నటించిన విషయం తెలిసిందే. 69ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో కనిపించే మమ్ముట్టి అఖిల్ సినిమాలో కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.