Homeట్రెండింగ్నెగిటివ్ కామెంట్స్ చేసిన వ్యక్తి కి బడిత పూజ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.!

నెగిటివ్ కామెంట్స్ చేసిన వ్యక్తి కి బడిత పూజ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.!

Man Beaten Up Brutally On Camera For Giving Negative Review Of 'Adipurush'; Internet Is Enraged, Prabhas fans fight at theater, Prabhas fans fire, Prabhas, Adipurush Negative reviews

Prabhas fans fire on Adipurush Negative Reviews: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ టాక్ గా నడుస్తున్న చిత్రం ఆదిపురుష్. డార్లింగ్ ప్రభాస్ రాముడు గా నటించిన ఈ చిత్రం నిన్న విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులు రకరకాలుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ తన పాత్రలో నటించడమే కాకుండా…ఆ పాత్రకు న్యాయం చేసే విధంగా ఉంటాడు అనేది టాలీవుడ్ లో అందరికీ తెలుసు.

Prabhas fans fire on Adipurush Negative Reviews: కానీ ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో నటించిన మెప్పించడం జరిగే పని కాదు. అభిమానులకు తమ అభిమాన స్టార్ ఏ రూపంలో ఉన్న నట్టు కాదు కానీ అందరికీ అలా ఉండాలి అన్న రూలేమీ లేదు కదా. సినిమా చూసిన అభిమానులు కొందరు ఆహా ఓహో అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరు పరవాలేదు యావరేజ్ గా ఉంది అంటున్నారు.. ఇంకొందరు అయితే పెదవి విరుస్తూ పక్కకు వెళ్తున్నారు.

సినిమా ఏదైనా ఫైనల్ వర్డిట్ చెప్పాల్సింది ప్రేక్షకులు మాత్రమే. ఒకరికి నచ్చిందని అందరికీ నచ్చాలి అంటే అది కుదిరే పని కాదు కదా. ఈ నేపథ్యంలో నిన్న ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఆది పురుష్ మూవీ చూసిన ప్రేక్షకుల నుంచి రివ్యూలు తీసుకున్నారు. పాపం ఒక అభిమాని మాత్రం తన మనసులో ఏముంది అన్న విషయాన్ని ఎంతో జెన్యూన్ గా బయటపెట్టి అందరి దగ్గర ఆఖరికి తన్నులు తిన్నాడు.

వివరాల్లోకి వెళితే ఆదిపురుష్ సినిమా మీ అభిప్రాయం ఏమిటి అని మీడియా వారు ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి సినిమా అస్సలు బాగాలేదని…రాఘవ పాత్రకు ప్రభాస్ సెట్ అవ్వలేదని…సినిమాలో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్లే స్టేషన్ లో ఆడే క్యారెక్టర్స్ లాగా ఉన్నాయని…తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అంతే అక్కడ ఉన్న ప్రభాస్ అభిమానులు అతనికి ప్రభాస్ అంటే ఇష్టం లేదని ,అందుకే అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అతనిపై విరుచుకు పడడమే కాకుండా పాపం చితకబాదారు. పక్కన ఉన్నవారు కలగజేసుకోవడంతో గొడవ మరీ పెద్దది కాకుండా ఆగింది. తమ అభిమాన హీరో మూవీ బాగాలేదు అని అంత డైరెక్ట్ గా చెప్పడంతో ఫాన్స్ మనోభావాలు దెబ్బ తిన్నాయి.

తీరా తన్నులు తిన్నాక కూడా ఆ వ్యక్తి మళ్లీ మీడియాతో మాట్లాడుతూ నిజాలు మాట్లాడినందుకు ఫ్యాన్స్ తన మీద ప్రతాపం చూపించారని.. వారికి మూవీ నచ్చలేదు ఆ ఫ్రస్టేషన్ తన మీద చూపించారని.. ఏదో సినిమా బాగాలేదు అన్న ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన డిప్రెషన్ తో తనపై దాడి చేశారని అందుకే వారిపై తనకు ఎటువంటి కోపం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు.

- Advertisement -
Man Beaten Up Brutally On Camera For Giving Negative Review Of 'Adipurush'

జంతువుల్ని చూపించడానికి ఈ సినిమా తీసినట్లుగా అనిపిస్తుంది అని మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అతన్ని అరెస్టు చేయాలి అనే రేంజ్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోపక్క కొందరు నిజం చెప్తే ఇలా రియాక్ట్ అయితే ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

Web Title: Man Beaten Up Brutally On Camera For Giving Negative Review Of ‘Adipurush’; Internet Is Enraged, Prabhas fans fight at theater, Prabhas fans fire, Prabhas, Adipurush Negative reviews

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY