Anushka Shetty: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు పెద్ద హీరోలు అలాగే హీరోయిన్ల డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు సంపాదించు అన్న ఉద్దేశంలో అడ్డమైన దారులు తొక్కుతూ ఉంటారు. ఇదే క్రమంలో చాలామంది మోసపోతారు కూడా. అలాగే ఇప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి అలాగే మణిశర్మ పేరు మీద భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
Anushka Shetty: లక్ష్మణా చారి అనే ప్రొడ్యూసర్ పోలీస్ కేస్ పెట్టడంతో ఈ విషయం బయటకొచ్చింది. హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) పేరు చెప్పి ప్రొడ్యూసర్ లక్ష్మణా చారి దగ్గర నుంచి 51 లక్షల రూపాయలు భారీ మోసం చేశారు ఎల్లా రెడ్డి అనే మేనేజర్.
ఇండస్ట్రీలో మేనేజర్ అంటూ చెప్పుకొని తిరిగే ఎల్లా రెడ్డి ఇటీవల విశ్వకర్మ క్రియేషన్స్ బ్యానర్ కు సంబంధించిన నిర్మాత లక్ష్మణా చారి కి అనుష్క శెట్టి అలాగే మణిశర్మ డేట్స్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు. మొదట అనుష్క అపాయింట్మెంట్ గురించి అని 31 లక్షలు తీసుకున్న ఎల్లా రెడ్డి ఆ తర్వాత మణిశర్మ అపాయింట్మెంట్ కోసం 20 లక్షలు నమ్మించి తీసుకున్నారని చెప్పుకు రావటం జరిగింది.
ఇదే క్రమంలో పలుసార్లు బెంగళూరుకు తీసుకువెళ్లి అక్కడ కొంతమందిని పరిచయం చేయగా, రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళ ఇద్దరి అపాయింట్మెంట్ డేట్స్ ఇప్పించలేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మణాచారి బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.
అయితే లక్ష్మణా చారి నిర్మాతల మండలిలో కూడా ఫిర్యాదు చేశారు. ఎల్లా రెడ్డిని ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దొరై హెచ్చరించినా ఫలితం లేకపోయేటప్పుడికి చివరికి పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు లక్ష్మణా చారి.