Manchi Rojulochaie Movie Review In Telugu
రేటింగ్: 2.75/5
నటులు:సంతోశ్ శోభన్,మెహరీన్ కౌర్,అజయ్ ఘోష్,ప్రవీణ్,వెన్నెల కిషోర్
దర్శకుడు: మారుతి
ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కుమార్
విభిన్నమైన కథల తో మనల్ని అలరించే మారుతీ ఈసారి మంచి రోజులు వచ్చాయి అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఎక్కువ భయపడినా ప్రమాదమే. అనే పాయింట్‌ను చెప్పడానికి డైరెక్టర్ మారుతి చేసిన ఓ ప్రయత్నమే ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్ అలాగే మెహరిన్ ఈ సినిమాలో నటీనటుల చేశారు. సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? సంతోశ్ శోభన్, మెహరీన్లకు సక్సెస్ వచ్చిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
హైదరాబాద్‌లోని భవానీ నగర్లో ఉండే తిరుమల శెట్టి గోపాలం అలియాస్ గుండు గోపాలం(అజయ్ ఘోష్) భయం ఎక్కువ. అతని కూతురు పద్మజ(మెహరీన్) బెంగుళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటుంది. అదే కంపెనీలో పనిచేసే తన కొలీగ్ సంతోశ్( సంతోశ్ శోభన్)ను ప్రేమిస్తుంది. సంతోశ్, పద్మజ హైదరాబాద్ బయలుదేరుతారు.
అయితే అదే కాలనీలో ఉంటున్న హీరోయిన్ తండ్రి సంతోషంగా ఉండటం ఇష్టం లేక, మెహరీన్ మీద లేనిపోని చెప్తారు. దాంతో గోపాలంలో లేనిపోని భయాలను రేపుతారు. ఒకానొక సందర్భంలో మూర్తి, కోటి దెబ్బకు గోపాలంకు గుండె నొప్పి కూడా వస్తుంది. దాంతో ఆమె సంతోశ్‌ను కలిసి తన తండ్రికి ఏమైనా అయితే ముఖం కూడా చూడనని వార్నింగ్ ఇస్తుంది. తన ప్రేమను గెలిపించుకోవడానికి అప్పుడు సంతోశ్ ఏం చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
సంతోశ్ శోభన్
మెహరీన్ కౌర్
అజయ్ ఘోష్ పర్ఫామెన్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్
క్లైమాక్స్
నటీనటులు:
ఎప్పుడు డిఫరెంట్ పాత్రలతో వస్తున్న సంతోష్ శోభన్ ఈసారి కూడా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాకి సినిమాకి తన పెర్ఫార్మెన్స్ పెంచుకుంటూ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు. మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాలో కూడా తన పాత్రలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. మారుతి అయితే తన కోసమే ఈ పాత్ర రాసినట్టు సంతోష్ పర్ఫామెన్స్ ఉంటుంది. అలాగే హీరోయిన్ మెహరిన్ తన అందచందాలతో కట్టిపడేస్తుంది.
ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర అజయ్ ఘోష్ గురించి చెప్పాలంటే సినిమా అంతా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కథకు తగ్గట్టుగానే తన పర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. ప్రవీణ్,వెన్నెల కిషోర్ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విలువలు ఏ మాత్రం తగ్గకుండా ప్రొడ్యూసర్ చూసుకున్నారు.
Also Read: శరవేగంగా షూటింగ్ లో గోపీచంద్, మారుతి పక్కా కమర్షియల్..!
దర్శకుడు మారుతి తను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్‌ను కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ రూపంలో కన్వర్ట్ చేయలేకపోయాడు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు, నేపథ్ సంగీతం అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. సాయిశ్రీరామ్ తన సినిమాటోగ్రఫీతో సన్నివేశాలకు రిచ్‌నెస్‌ను తీసుకొచ్చాడు.
విశ్లేషణ:
డైరెక్టర్ మారుతి పాత సినిమాలు అయినా ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ అదే చౌదరి లో ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. కాకపోతే ఇక్కడ అ హీరోకి లోపం పెట్టకుండా హీరోయిన్ తండ్రికి లోపాలు పెడతాడు. తన పాత్రను ప్రధానంగా చేసుకుని పాత్రలు అల్లుకుంటూ వచ్చాడు. సంతోశ్ తన ప్రేమ కోసం రొటీన్ సినిమాలో హీరోలా హీరోయిన్ ఇంటి పక్కన అద్దెకు దిగి, ఆమె తండ్రిని ఇంప్రెస్ చేసే పాత్రలో కనిపిస్తాడు.
ఫస్టాఫ్‌లో కథను అటు ఇటు తిప్పిన చోటే తిప్పినట్లు అనిపిస్తుంది. దీంతో సినిమా అక్కడే ఉందనే ఫీలింగ్ ప్రేక్షకుడికి వస్తుంది. కానీ కూతురు ని అతి జాగ్రత్తగా చూసుకునే తండ్రి కి సంబంధించినది ఈ విషయంలో రూపొందించిన కామెడీ మరియు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. మొదటి భాగంలో సినిమానే ఎక్కువ బోర్ కొట్టకుండా అలాగే ల్యాగ్ లేకుండా మారుతి తెరకెక్కించారు.
Also Read: వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇక సెండాఫ్. కూతురికి తండ్రిపై, తండ్రికి కూతురిపై ఉన్న ఎమోషన్‌ను చూపిస్తూనే తల్లి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఓ కోణంలో ఎలివేట్ చేసుకున్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ ని చూపించడానికి బాగానే ట్రై చేసాడు, కానీ అది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయినట్లు అనిపించదు. ఇక అజయ్ ఘోష్ క్యారెక్టర్‌కు, కమెడియన్ ప్రవీణ్ లేడీ వాయిస్‌తో మాట్లాడే అప్పడాల విజయలక్ష్మి అనే ఫిక్షనల్ పాత్రకు మధ్య ఉండే కామెడీ ట్రాక్ మాత్రం ప్రేక్షకుడిని బాగానే నవ్విస్తుంది.
అప్పటి వరకు భయపడుతూ ఉండే అజయ్ ఘోష్ పాత్ర.. క్లైమాక్స్‌లో రెండు నిమిషాలకే పూర్తిగా మారిపోతుంది. హాస్పిటల్లో ఓ సాధారణ సన్నివేశంతో సినిమాను మారుతి తెర దించుతారు. మొత్తం మీద మంచి రోజులు వచ్చాయి సినిమా ఈ దీపావళికి ఫ్యామిలీతో వెళ్లి ఒకసారి నవ్వు కోవడానికి బాగానే ఉంటుంది.