ఏదో ఒక రకంగా ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే మంచు ఫ్యామిలీ మరోసారి టాలీవుడ్ మైండ్ బ్లాక్ న్యూస్ తో సెన్సేషన్ సృష్టించబోతుంది. మంచు మోహన్ బాబు చివరిసారిగా సన్ ఆఫ్ ఇండియా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఆ చిత్రం ఎవరు ఊహించని విధంగా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇటు మంచు విష్ణు చివరిసారిగా చేసిన మోసగాళ్లు మరియు జిన్నా సినిమాలు విపరీతమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. కంటెంట్ లేకుండా భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన చిత్రాలు హిట్ అవ్వవు అనడానికి మంచు ఫ్యామిలీ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మంచు మోహన్ బాబు మరియు విష్ణు ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారట. ఈ స్టోరీని రియల్ లైఫ్ కథతో తెరకెక్కించబోతున్నామని మీరు క్లారిటీ కూడా ఇచ్చారు. మంచు మోహన్ బాబు స్థాపించినటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల యొక్క నేపథ్యంలో సామాజిక సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది అని సమాచారం.
అంటే ఓ మోస్తారు మోహన్ బాబు బయోపిక్ కింద ఈ చిత్రాన్ని జమ కట్టవచ్చు. విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి అన్న మోహన్ బాబు సంకల్పం దగ్గర నుంచి…యూనివర్సిటీగా అభివృద్ధి చెందిన సారాంశాన్ని కథగా చెప్పబోతున్నారు. అయితే ఈ సినిమా యొక్క స్టోరీ పై ప్రస్తుతం వర్క్ జరుగుతుంది.. అది పూర్తి అయితే త్వరలో ఈ ప్రాజెక్టు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు.

అయితే ఈ నేపథ్యంలో 100 కోట్ల బడ్జెట్ ఎంతవరకు వాస్తవం అనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. గతంలో మోసగాళ్ల సినిమా విషయంలో కూడా 50 కోట్ల బడ్జెట్ అని ముందు చెప్పారు కానీ తీరా మూవీ రిలీజ్ అయిన తర్వాత అంత బడ్జెట్ పెట్టే సీన్ లేదు అని స్పష్టమైపోయింది. ఇటు లక్ష్మీ అటు విష్ణు ఇంతవరకు కొత్త ప్రాజెక్టులు ఏవి డిక్లేర్ చేయలేదు ఈ సందర్భంలో రాబోయే ఈ చిత్రం పెద్ద మంచు ఫ్యామిలీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కొందరు విమర్శిస్తున్నారు.
Web Title: Manchu family 100 crores movie, Manchu Mohan babu new movie details, Manchu family next movie, Vishnu new movie, Vishnu Manchu latest movie updates