మహిళ చేసిన ట్వీట్ పై స్పందించిన మంచు మనోజ్…!

0
500
manchu manoj reaction on hyderabad lady sexual harassment allegations

sexual harassment: Manchu Manoj: ఈ మధ్యకాలంలో మహిళలు సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు గురవుతుండటం ఎక్కువగా చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం పొందుపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం, పోలీసులు ఓ వైపు పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నా. నిర్భయ దిశా ఘటనలు జరిగినప్పుడు మనోజ్ ఎలా స్పందించాడో అందరం చూసాం. ఇప్పుడు తాజాగా ఒక మహిళ ఓ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనకు వేధిస్తున్నారని పెట్టిన ట్వీటీకి స్పందించాడు మంచు మనోజ్.

తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని పేర్కొంటూ హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా తన గోడు వెల్లడించింది. ఓ ప్రముఖ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తనను లైంగికంగా, మెంటల్‌గా టార్చర్ పెడుతున్నారంటూ ట్వీట్ పెట్టింది. నా ఫోన్ లో జరిగే ప్రతి యాక్టీవిటీని తెలుసుకుని నన్ను మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఒక వ్యక్తి ప్రైవేట్ సమాచారం తెలుసుకోవడం ఎలా సాధ్యమో నాకు తెలియదు.. ఇంతకముందు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నాకు న్యాయం జరగలేదు అని పేర్కొంది. ఇది చూసిన మంచు మనోజ్ సదరు మహిళకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

”హాయ్ అమ్మా.. నీకు ఈ పరిస్థితులు ఎదురుకావడం చాలా బాధగా అనిపిస్తోంది. ఆ వ్యక్తుల వివరాలు, ఫోన్ నెంబర్ తెలుపుతూ నా ఇన్ బాక్స్‌కి మెసేజ్ పెట్టండి” అని మనోజ్ పేర్కొన్నారు. దీంతో ఆయనిచ్చిన ఈ రెస్పాన్స్ జనాల్లో పలు చర్చలకు తెరలేపింది. సదరు మహిళ తీరును విమర్శిస్తూ గతంలో ఆమె పెట్టిన కొన్ని పోస్టులను కామెంట్స్ రూపంలో అందరి ముందుంచుతున్నారు నెటిజన్లు. మనోజ్ అన్నా.. ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి అంటూ వారు కోరుతున్నారు.

 

Previous articleపూజా హెగ్డేకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గిఫ్ట్
Next articleLucky Beauty To Romance Akhil next movie