Manchu Vishnu Ginna Trailer: మంచు విష్ణు కొత్త సినిమా జిన్నా టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. జిన్నా మూవీ టీజర్ తో మంచి మార్కులు కొట్టేసిన మంచు విష్ణు ఇప్పుడు సినిమాకు సంబంధించిన జిన్నా ట్రైలర్ (Ginna Trailer) ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ని అక్టోబర్ 21న విదుధలకు సిద్ధం చేసారు..
మంచు విష్ణు (Manchu Vishnu) ఈసారి డిఫరెంట్ స్టోరీతో అలరించటానికి వస్తున్నట్టు ఈ సినిమా జిన్నా ట్రైలర్ (Ginna Trailer) చూస్తే అర్థమవుతుంది. జిన్నా రంగంపేటలో టెంట్ హౌస్ నడుపుతుంటాడు అలాగే ఊరు మొత్తం అప్పులు చేస్తాడు. అలాగే విలన్ దగ్గర అప్పు తీసుకుని వడ్డీ చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
అతను చాలా అప్పుల్లో ఉన్నాడు కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అలరిస్తుంది. సినిమాలో ఘోస్ట్ ఎంట్రెన్స్ పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు అయితే దాని లో కూడా ఎక్కువ రివీల్ చేయలేదు మేకర్స్. ఓవరాల్ గా జిన్నా టైలర్ (Ginna Trailer) సూపర్ అని చెప్పవచ్చు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ ఆడియన్స్ ముందుకు రానుంది. హీరోయిన్స్‌గా పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ (Sunny Leone) నటిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జిన్నా ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.