Homeసినిమా వార్తలుమంచు విష్ణు.. ‘మోసగాళ్లు’ మోషన్ పోస్టర్..

మంచు విష్ణు.. ‘మోసగాళ్లు’ మోషన్ పోస్టర్..

Manchu Vishnu Mosagallu Title Motion Poster: చాలా కాలంగా మంచు విష్ణు సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఆచారి అమెరికా యాత్ర తర్వాత ఎందుకో ఈయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. మంచు విష్ణు నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈ సినిమా మోషన్ పోస్టర్, టైటిల్ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంకటేష్ శుక్రవారం ఆవిష్కరించారు.

వరసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో విష్ణు ఇప్పుడు పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ కథతో వస్తున్నాడు. కాజల్‌, ఈయన జంటగా మోసగాళ్లు అనే సినిమా వస్తుంది. జంటగా అంటే ఇందులో జోడీ అని కాదు.. అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్.. మంచు విష్ణు, కాజల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ మించిప టైటిల్ థీమ్ మ్యూజిక్‌తో కూడిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ‘మోసగాళ్ళు’ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ‘ది రైజ్ ఆఫ్ మోసగాళ్ళు’ అని పిలుస్తోంది. ఈ థీమ్ మ్యూజిక్ చాలా బాగుంది. 100 అమెరిక‌న్ డాల‌ర్ల నోట్‌ను ఉప‌యోగించి డిజైన్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా రాలేదు.

ఈ సినిమాను జెఫ్రీ జీ చిన్ తెరకెక్కిస్తున్నాడు. విష్ణు సొంత సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY