మంచు విష్ణు ‘మోసగాళ్లు’ ట్రైలర్

391
manchu-vishnu-movie-mosagallu-trailer-released
manchu-vishnu-movie-mosagallu-trailer-released

టాలెంటెడ్ హీరో మంచు విష్ణు తాజాగా చేస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జాఫ్రె చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

 

 

అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాట నవదీప్ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

 

 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల అయింది. ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ‘డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా’ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకొని వెళుతోంది. ఈ సినిమాతో విష్ణు అనుకున్న స్థాయి హిట్ అందుకుంటారని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాను తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.