మంచు విష్ణు సినిమా థియేటర్స్ లోకి వచ్చి సంవత్సరం దాటింది.అంతకుముందు కూడా పెద్దగా విజయాలు లేకపోయినా గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేసేవాడు.కానీ ఇప్పుడు మాత్రం సినిమాల మీద నుండి ఫోకస్ షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది.అయితే మంచు విష్ణు హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడో ఒక సినిమా తెరకెక్కింది.ఓటర్ అని టైటిల్ పెట్టి సినిమా మొత్తం పూర్తిచేశారు.తీరా ఎలక్షన్ టైం లో రిలీజ్ చేద్దాం అనుకునేసరికి సినిమా హీరో విష్ణు రిలీజ్ కి అడ్డుపడుతున్నాడు అని ఆ సినిమా డైరెక్టర్ తరఫునుండి ఒక వివాదం కూడా నడించింది.

ఆ సినిమా ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది.ట్రైలర్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అనగానే రాజకీయనాయకుడితో ఒక కామన్ మ్యాన్ కి మధ్య ఒక క్లాష్ ఏర్పడడం అనే కామన్ పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది.కానీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటే మాత్రం సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.ఈ సినిమాలో పోసాని,సంపత్,నాజర్ లాంటి సీనియర్ నటీనటుల కూడా నటించారు.ట్రైలర్ వరకు రిచ్ గా,కాస్త ప్రామిసింగ్ గానే అనిపిస్తుంది.మరి ఈ ఓటర్ ఆకట్టుకుంటాడా? లేక రొటీన్ అనిపిస్తాడా? అనేది ఈ శుక్రవారం తేలుతుంది.