సాయి తేజ్‌కి మంచు విష్ణు వార్నింగ్.. తేజూ రిప్లె అదిరింది

1213
manchu vishnu warning to mega hero sai dharam tej
manchu vishnu warning to mega hero sai dharam tej

(manchu vishnu warning to mega hero sai dharam tej for solo Brathuke So Better movie poster) మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రలహరి మరియు ప్రతిరోజు పండుగే చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకుని మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వాలంటైన్ వీక్ సందర్భంగా సోలో బ్రతుకు గురించి సాయి తేజ్ ఒక ఫిలాసఫీ చెప్పారు. తన సోలో బ్రతుకును తాను చాలా బాగా నడిపిస్తున్నానని, అలాగే.. తనలాగా సింగిల్‌గా ఉన్నవాళ్లు సోలో బ్రతుకును ఎలా గడుపుతున్నారో చెప్పాలని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సోలో బ్రతుకు ఎందుకు బెటరో ఈ ట్వీట్‌లో వివరించారు.

సోలో బ్రతుకు వల్ల తనకున్న అడ్వాంటేజస్‌ను ట్వీట్‌లో కింది విధంగా వివరించారు తేజు..
ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను… రెస్టారెంట్‌కి వెళ్తే నా ఫుడ్‌కి మాత్రమే నేను పే చేస్తాను. (వాలెట్‌కి బొక్క పడే ఛాన్సే లేదు)… క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు…. షూట్, క్రికెట్, జిమ్, హోమ్, ఫ్రెండ్స్ – నాకు నచ్చినంత టైమ్ నాకు నచ్చిన వాటితో నేను స్పెండ్ చేయొచ్చు.

తేజూ పోస్ట్ కు మంచు విష్ణు ఫన్నీగా స్పందించాడు. తమ్ముడు.. నా చిట్టి తమ్ముడు తేజూ ఈ ట్వీట్ ను నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తానుగా అంటూ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మంచు విష్ణు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కు తేజూ స్పందిస్తూ.. విష్ణు అన్న అందరు మీ అంత లక్కీ కాదు కదన్న అంటూ ట్వీట్ చేశాడు.

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.