Mani chandana as Janhvi Kapoor’s Mother NTR30: కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీ ఎన్టీఆర్ 30. ఈ సినిమాపై ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ బాగానే అంచనాలు పెట్టుకున్నారు. NTR30 cast సంబంధించి వారానికి ఒక అప్డేట్ బయటికి వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న జాహ్నవి కపూర్ తల్లిగా సీనియర్ నటి చాన్స్ కొట్టేసిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. వారం రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) భార్యగా సీరియల్ నటి చైత్ర నటిస్తున్నట్టు వార్తలు ప్రచారం జరిగాయి.
Mani chandana as Janhvi Kapoor’s Mother NTR30: ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న జాహ్నవి కపూర్ తల్లిగా కూడా సీరియల్ నటి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. NTR30 సినిమా ఇప్పటికే మొదటి రెండు షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకోగా ఈనెల 17 నుండి సరికొత్త షూటింగ్ షెడ్యూల్ ని మొదలుపెట్టడానికి కొరటాల శివ టీం రెడీ అవుతున్నారు. NTR30 cast సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు లేదు. మూవీ టీం నుండి ఇప్పుడు దాక వచ్చిన అప్డేట్స్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తుండగా, శ్రీకాంత్ కీలకమైన పాత్రలో చేస్తున్నారు.
ఇక జాహ్నవి కపూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రూల్స్. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జాహ్నవి కపూర్ తల్లిగా (Janhvi Kapoor Mother) సీనియర్ నటి మణిచందన (Mani Chandana) తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తొలిప్రేమ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది మని చందన. అలాగే రవితేజ నటించిన మనసిచ్చాను చూడు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం తను తెలుగు, తమిళ్ అలాగే కన్నడ సీరియల్స్ లో నటిస్తుంది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని ట్రెండ్ గా మార్చారు. మరి దీనిపై కొరటాల టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదే కాకుండా మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్తడే కావటంతో అభిమానులు అలాగే మూవీ లవర్స్ కూడా ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సమాచారం మేరకు NTR30 Pre look కానీ లేదంటే ఫస్ట్ లుక్ (First Look) గాని విడుదలకు కొరటాల టీం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. NTR30 సినిమాని కొరటాల శివ దాదాపు 250 కోట్ల బడ్జెట్ (NTR30 budget) తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.