
యంగ్ హీరో,వెటరన్ హీరో అని కాదు ప్రతి ఒక్కరికి ఈ మధ్య కామన్ గా ఎదురవుతున్న సమస్య హీరోయిన్ ఎంపిక.బాలయ్య,అఖిల్,చిరు….ఈ లిస్ట్ లో తేజు కూడా చేరాడు.వరుసగా డిజాస్టర్ లతో సతమతం అయ్యి చిత్రలహరితో ఊపిరి పీల్చుకున్న తేజు మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ప్రతో రోజు పండుగ అనేది ఆ సినిమా టైటిల్.కానీ ఆ పండుగ మొదలవ్వడమే ఒక సమస్యగా మారింది.దానికి కారణం హీరోయిన్.
మెహ్రీన్ తో తేజు చెయ్యనని చెప్పాడు అని టాక్.కాస్త పేరున్న మిగతావాళ్ళని టచ్ చేతే మినిమమ్ 70 లక్షలు.పది,పదిహేను లక్షల్లో వచ్చేవాళ్ళని తీసుకుంటే సినిమాకి క్రేజ్ రాదు అని మారుతి భయం.చివరికి కాస్త ఎక్కువయినా,ఉన్న వాళ్లలో బెటర్ అని రాశి ఖన్నా ని ఎంచుకుంటున్నారు అనే వార్త హల్చల్ చేస్తుంది.గతంలో వీళ్ళ కాంబినేషన్ లో సుప్రీమ్ అనే సినిమా వచ్చి ఉండడంతో ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.పైగా తొలిప్రేమ తరువాత రాశిఖన్నా ఎలాంటి పాత్ర అయినా సునాయాసంగా చెయ్యగలదు అని ప్రూవ్ అవ్వడంతో మారుతి కూడా ఓకే అన్నాడట.ఇదే న్యూస్ అఫీషియల్ అయితే మారుతి డైరెక్షన్ లో తేజు పండగ చేసుకోవచ్చు.