Homeట్రెండింగ్ఆదిపురుష్ లో ఆంజనేయుడు నోట మాస్ డైలాగ్స్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు…

ఆదిపురుష్ లో ఆంజనేయుడు నోట మాస్ డైలాగ్స్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు…

Mass dialogue by lord Hanuman in Adipurush details, lord Hanuman Dialogue from Adipurush, Severe Outlash For Lord Hanuman’s Dialogues In Adipurush, Prabhas, Krithi Sanon,

Mass dialogue by lord Hanuman in Adipurush: ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన మైథాలజికల్ చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడి జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం లోని కొన్ని సంభాషణలు మరియు సన్నివేశాలపై ప్రజలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంజనేయుడు చేతే మాస్ డైలాగ్స్ చెప్పించారు అని కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడు మా స్టైల్ లో చెప్పడం ఏమిటి అని నెటిజన్లు ఆన్లైన్లో మీమ్స్ పెడుతున్నారు.

Mass dialogue by lord Hanuman in Adipurush: రావణాసురుడు అపహరించిన జానకి దేవుని వెతుక్కుంటూ తిరుగుతున్న రాముడికి సుగ్రీవుడు, హనుమంతుడు ఎదురవుతారు. సీత జాడ వెతకడానికి సహాయం చేస్తాను అని మాట ఇచ్చిన సుగ్రీవుడు హనుమంతుని ఆ పని కోసం పంపుతాడు. లంకకు వెళ్ళిన ఆంజనేయుడు సీత జాడ కనుక్కొని కావాలని రావణుడికి దొరుకుతాడు.

ఈ నేపథ్యంలో సభలో రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టడం ,హనుమంతుడు ఆ తోకతోటే లంకను తగలబెట్టడం…ఇలా లంక దహనానికి దారితీస్తుంది. ఇది మన అందరికీ తెలిసినటువంటి రామాయణం. ఇప్పటివరకు తీసిన రామాయణానికి సంబంధించిన ఏ చిత్రంలో అయినా, సీరియల్ లో అయినా ,లేక పుస్తకంలో అయినా సరే హనుమంతుడు రాముడిని పొగడడం మాత్రమే తెలుసు కానీ మాస్ డైలాగ్ చెప్పడం మనం ఈ సిచువేషన్ లో ఇంతవరకు ఎరుగం.

మరి అలాంటిది ఆదిపురుష్ మూవీ లో హనుమంతుడి తోకకు నిప్పు అంటించిన ఇంద్రజిత్తు ‘ కాలిందా ?’ అని అడుగుతాడు. దానికి హనుమంతుడు “నా తోకకు కట్టిన వస్త్రం నీ బాబుది…రాసిన చమురు నీ బాబుదే…. పెట్టిన నిప్పు నీ బాబుదే…కాబట్టి కాలేజీ కూడా నీ బాబుకే..”అని హై వోల్టేజ్ మాస్ డైలాగ్ వదులుతాడు. ఇదేమన్నా ఫ్యాక్షన్ మూవీ హనుమంతుడికి డైలాగ్ పెట్టడానికి…అని ప్రస్తుతం ఈ డైలాగ్ పై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది.

Mass dialogue by lord Hanuman in Adipurush

పరమ పవిత్రమైనటువంటి ఇతిహాసాన్ని చెబుతూ ఇటువంటి చీప్ డైలాగ్స్ ఎలా రాశారు అని రైటర్ ను ఆడిపోసుకుంటున్నారు. అయితే ఈ మూవీకి డైలాగ్స్ రాసిన డైలాగ్ మనోజ్ ముంతాషీర్ మాత్రం తన చిన్నతనంలో అమ్మమ్మ రామాయణాన్ని ఇలాగే చెప్పింది అని వాదిస్తున్నాడు. నేటి తరాన్ని ఆకర్షించే విధంగా వినూత్నంగా కాస్త మార్పులు చేసి డైలాగ్ రాశానని.. సమర్ధించుకున్నాడు కూడా.

Web Title: Mass dialogue by lord Hanuman in Adipurush details, lord Hanuman Dialogue from Adipurush, Severe Outlash For Lord Hanuman’s Dialogues In Adipurush, Prabhas, Krithi Sanon,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY