మాస్ మహారాజ్ “ఖిలాడి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

0
16
Mass Maharaj Ravi Teja Khiladi Shooting update

Ravi Teja – Khiladi: రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను దర్శకుడు వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ అదే జోష్ లో ఖిలాడి సినిమాను పూర్తి చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది . సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ను నిలిపివేశారు.

ఇటీవలే మేకర్స్ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ రూమర్స్ పై చెక్ పెట్టి థియేటర్స్ లోనే విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేసారు. రాక్షసుడు సినిమాతో విజయం అందుకున్న రమేష్ వర్మ రవితేజ కోసం సస్పెన్స్ థ్రిల్లర్ ను సిద్ధం చేసాడు.  ఖిలాడి చిత్రంలో ఇంకా రెండు పాటలు సహా ఒక నెల రోజుల లోపే షూట్ బాకీ ఉందట. ఇవన్నీ అయ్యిపోతే మంచి టైం చూసి థియేటర్స్ లో విడుదల చెయ్యడమే తరువాయి అని తెలుస్తుంది.

Also Read : Anil Ravipudi Multi starrer movie with Ravi Teja and Ram Pothineni 

సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు..

Also Read : Ravi Teja Khiladi Makers Clarify On OTT Release