సీన్స్ లీక్ చేసినందుకు 25 కోట్ల డిమాండ్ చేసిన ‘మాస్టర్’ మూవీ ప్రొడ్యూసర్

416
master-movie-producer-demands-rs-25-crore-for-leaking-scenes
master-movie-producer-demands-rs-25-crore-for-leaking-scenes

దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మూవీ ‘మాస్టర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ లోను, తెలుగులోనూ విదులైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ లోను రికార్డులు క్రియేట్ చేస్తుంది.  మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 

 

భారీ వసూళ్లు సాధించిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ఓ వీడియో లీక్ అయింది. క్లైమాక్స్ ఫైట్ తో పాటు మరికొన్ని సీన్స్ కూడా లీక్ అయ్యినవిషయం తెలిసిందే…అది లీక్ చేసిందెవరో కూడా బయటికి వచ్చింది. రెండు మూడు రోజులు సైబర్ క్రైమ్ అన్వేషించి పట్టుకున్నారు. దాంతో సదరు సంస్థకు నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు నిర్మాత లలిత్ కుమార్. దాదాపు 100 కోట్లతో నిర్మించిన తమ సినిమాను పైరసీ చేసి.. తమకు ఇబ్బందులు కలిగించిన డిజిటల్‌ సంస్థను 25 కోట్ల నష్ట పరిహారం కోరుతూ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ నోటీసులు పంపించాడు. ఈ మేరకు తమకు వెంటనే 25 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసారు.