Mayabazaar For Sale Trailer Released: ఓ గేటెడ్ కమ్యూనిటిలో భిన్న మనస్తత్వాలున్న కుటుంబాలుంటాయి. కోప తాపాలుంటాయి. ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. కొందరిని గమనిస్తే విచిత్రంగా కూడా అనిపిస్తాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీ వాతారణంపై రూపొందిన వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. ఎప్పటి కప్పుడు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న టాప్ వెబ్ ఫ్లాట్‌ఫామ్ జీ 5లో ఈ సిరీస్ జూలై 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
Mayabazaar For Sale Trailer Released: డా. నరేష్ వి.కె, నవదీప్, ఝాన్సీ, ఈషా రెబ్బా, మెయంగ్ చంగ్, కోట శ్రీనివాసరావు, సునైన, హరితేజ, రాజా చెంబోలు, రవివర్మ తదితరులు నటించారు. ట్రైలర్‌ను గమనిస్తే.. మాయాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటిలో కుటుంబాలు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయనే విషయాన్ని కామెడీ కోణంలో చూపించారు.
కొందరు పిల్లుల్ని పెంచుకుంటుంటారు, కొందరు ఆవులను పెంచుతుంటారు. ఓ ఇంటావిడైతే మొగుడిపై అనుమానంతో గొడవ పడుతూనే ఉంటుంది. కొందరు చాదస్తంగా మాట్లాడుతుంటారు. వీరందరి కలిసి ఉండే గేటెడ్ కమ్యూనిటీని ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతంలోకి నిర్మించి ఉంటారు.

చివరకు మాయాబజార్ గేటెడ్ కమ్యూనిటీలోని ఇళ్లను కూల్చి వేయాలని బుల్డోజర్స్‌తో అధికారులు వస్తారు. అప్పుడు ఏమవుతుంది. వారి గేటెడ్ కమ్యూనిటీని కాపాడుకున్నారా? అనేది తెలియాలంటే జూలై 14 వరకు ఆగాల్సిందే.