అపోలో వైద్యులు సాయి ధరమ్‌ తేజ్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల..!

0
19
Medical bulletin of Actor Sai Dharam Tej Accident

Sai Dharam Tej Health condition: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిన్న (ఆదివారం) సాయి తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అపోలో వైద్యులు సోమవారం సాయి ధరమ్‌ తేజ్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

”సాయి తేజ్‌ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యింది. ప్రస్తుతం ఆయన చికత్సకు స్పందిస్తున్నారు. మొదటిలో ఉన్న దానికంటే వెంటిలేటర్‌ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంది” అని అపోలో ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి.

Medical bulletin of Actor Sai Dharam Tej Accident

కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్‌ తేజ్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలు అయిన విషయం తెలిసిందే.