mega brother naga babu tested covid 19 positive

Naga Babu Corona Positive: నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్‌ను గందరగోళానికి గురిచేస్తోంది. ఆయన కరోనా పాజిటివ్ వచ్చిందని కొంత మంది అంటుంటే.. సోకలేదని కొంత మంది అంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా మెగా బ్రదర్, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘ఒక ఇన్ఫెక్షన్ ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మార్చుకోవచ్చు. కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో పోరాడి ప్లాస్మా దాతను కావాలి’’ అని నాగబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

మరోవైపు నాగబాబు ట్వీట్‌ చేసిన వెంటనే మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ అని కొద్దిరోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు. సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్, రాజమాళి కుటుంబం, యం.యం.కీరవాణి కుటుంబం, సింగర్ సునీత, సింగర్ మాళవిక, పాప్ సింగర్ స్మిత, టీవీ నటులు రవికృష్ణ, నవ్య స్వామి, ‘సాక్షి’ శివ, హరికృష్ణ, ప్రభాకర్, భరత్వాజ్ ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు.