mega brother nagababu gets corona positive

Naga Babu: కరోనా వైరస్ ప్రస్తుతం ఎవర్నీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ వైరస్ వచ్చేస్తుంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇండస్ట్రీలో కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా బండ్ల గణేష్, రాజమౌళి సహా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనాతో పోరాడి విజయం సాధించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం నెల రోజుల తర్వాత కరోనా నెగిటివ్ తెచ్చుకున్నారు. తాజాగా మెగాస్టార్ సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా దగ్గు, జర్వం లక్షణాలతో బాధపడుతున్న ఆయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. నాగబాబు ఓ ప్రముఖ ఛానల్‌లో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆ షోలో పాల్గొన్నవారితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారట. ప్రస్తుతం నాగబాబు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు మరికొందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై నాగబాబు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.