Mega Brother Nagababu Given Marriage Assets To His Son In Law Chaitanya

Niharika Wedding: మెగా వారసురాలు అందరికీ ముద్దుల అమ్మాయి..మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. నాగబాబు కుమార్తు నిహారిక పెళ్లి డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి విషయంలో ఎక్కడా తగ్గడం లేదు మెగా బ్రదర్ నాగబాబు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానం పలుకుతున్నారు.

ఈ క్రమంలోనే వారింట మొదటి శుభకార్యం కావడంతో ఖర్చుకు వెనకాడకుండా .. వివాహాన్ని అందరికీ ఓ మధుర జ్ఞాపకంగా మిగిల్చేందుకు నాగబాబు ఫ్యామిలీ ప్లాన్ చేసింది. అయితే నాగబాబు తన కాబోయే అల్లుడు చైతన్యకు ముట్టజెబుతున్న లాంఛనాలపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగబాబు తన అల్లుడికి సుమారు రూ.10కోట్ల వరకు లాంఛనాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నిహారిక పేరు మీద ఉన్న బంగ్లాను కూడా అల్లుడికే ఇచ్చేస్తున్నారట. ఆసియాలోనే ది బెస్ట్ హోటల్ గా పేరొందిన ఒబెరాయ్ ‘ఉదయ్ విలాస్ ప్యాలెస్’ను నిహారిక-చైతన్య వివాహ వేదికగా నాగబాబు ఫ్యామిలీ ఎంపిక చేసింది.

ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇప్పటికే నిహారిక-చైతన్య ఉదయ్ విలాస్ ప్యాలెస్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ కూతురు ఈశా సంగీత్ వేడుక కూడా ఈ ఉదయ్ విలాస్ లోనే జరగడం విశేషం. సెలబ్రెటీల ఇంట వివాహాలు జరిగినప్పుడు లాంఛనాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు ఎంత ఇస్తున్నారు.. అవతలి వాళ్లు ఎంత పుచ్చుకుంటున్నారన్నది వాళ్లకే తెలియాలి.