Chiranjeevi Sye Raa, Varun tej Valmiki and Allu arjun Ala Vaikunthapuramlo, First teasers -min
Chiranjeevi Sye Raa, Varun tej Valmiki and Allu arjun Ala Vaikunthapuramlo, First teasers -min

ఇండిపెండెన్స్ డే కి సినిమాలకు సంబందించిన కీలకమయిన అప్డేట్ ఇవ్వడం అనేది కామన్.ఈసారి కూడా చాలా సినిమాలకు సంబందించిన రకరకాల అప్డేట్స్ బయటికి వచ్చాయి.అయితే వాటిలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలకు సంబందించిన టీజర్స్ అండ్ టైటిల్స్ వచ్చాయి.ముందుగా మెగాస్టార్ చిరంజీవి మచ్ అవైటెడ్ మూవీ సైరా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.టీజర్ పై అంచనాలు పెరిగేలా,సినిమాలో గ్రాండియర్ తెలిసేలా ఈ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.శాంపిల్ గా చిరు వారియర్ లుక్ ని కూడా చూపించారు.ఆ వీడియో సోషల్ మీడియా ని షేక్ చేసింది.

నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ ఇచ్చిన బన్నీ త్రివిక్రమ్ తో కలిసి తన హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ చేసాడు.2020 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ముందు అలకనంద,నేను…నాన్న అనే టైటిల్స్ అనుకున్నారు.కానీ ఫైనల్ గా అల వైకుంఠపురములో….అనే టైటిల్ పెట్టారు.బన్నీ సినిమా వచ్చి చాలాకాలం అవ్వడం,ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్ కావడంతో ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందరికి షాక్ ఇస్తూ విలన్ గా టర్న్ తీసుకున్నాడు.హిట్ కోసం విపరీతముగా ట్రై చేస్తున్న హరీష్ శంకర్ కూడా చాలా కేర్ తీసుకుని వాల్మీకి లో వరుణ్ క్యారెక్టర్ డిజైన్ చేసాడు.ఇప్పుడు వాల్మీకి కి మేజర్ అట్రాక్షన్ ఈ క్యారెక్టరే.అందుకే వరుణ్ తేజ్ ని ఫోకస్ చేస్తూ టీజర్ కట్ చేసాడు.ఆ టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ దక్కింది.ఈ టీజర్ లోనే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు.ఈ నాలుగు సినిమాల ప్రమోషనల్ మెటీరియల్ కి ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ దక్కింది.మూడు కూడా మూడు డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కిన సినిమాలు కావడం,ప్రతి సినిమాకీ స్పెషల్ స్ట్రైకింగ్ పాయింట్ ఉండడంతో మూడింటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.దీంతో టోటల్ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఈ మ్యాజిక్ రేపు థియేటర్స్ లో ఎలా వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.