Mega power star Ram charan Chief guest for Mahesh babu Sarileru Neekevvaru Pre Release event..
Mega power star Ram charan Chief guest for Mahesh babu Sarileru Neekevvaru Pre Release event..

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది ఆ చిత్ర యూనిట్. ముఖ్యంగా మహేష్ బాబు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే చాలు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారా.. మహేష్ బాబు ఏమి మాట్లాడుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్-మహేష్ బాబు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ అందరికీ తెలిసిందే..! ఈ అభిమానంతోనే ఒకరి సినిమా ఫంక్షన్స్ కు మరొకరు వెళుతూ ఉంటారు. అలానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ రాబోతున్నారని తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి పాత్ర సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాని విడుదల చేయనున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం వుంది.