Mega powerstar Ram charan on About Salman Khan at Dabangg 3 telugu pre release event
Mega powerstar Ram charan on About Salman Khan at Dabangg 3 telugu pre release event

‘దబాంగ్‌ 3’ ప్రీ రిలీజ్‌ వేడుక.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన చిత్రం `దబాంగ్ 3`. ప్రభుదేవా దర్శకుడు. సల్మాన్‌ఖాన్ ఫిలింస్‌, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్‌, సఫ్రాన్ బ్రాడ్‌కాస్ట్ మీడియా లి. పతాకాలపై సల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేశ్ , మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రామ్‌చరణ్ మాట్లాడుతూ ఈ ఒక్క కార్యక్రమంలో, ఒక్క వేదికపై, కొన్ని మాటల్లో సల్మాన్‌ భాయ్‌పై నాకున్న ప్రేమను చెప్పలేను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. సల్మాన్‌, వెంకీ, సుదీప్‌, చిరంజీవి లాంటి సూపర్‌స్టార్స్‌ నుంచి నేను ఓ కామన్‌ విషయం నేర్చుకున్నా. అదే క్రమశిక్షణ.. నేటి మా తరం వీరి నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రభుదేవా సర్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు.

దబంగ్ 3′ హిందీలో కాకుండా తెలుగులోనూ వస్తోంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ట్రైలర్‌ చాలా బాగుంది. సల్మాన్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో దుమ్మురేపాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాను సూపర్‌ సక్సెస్‌ చేయాల’ని అనంతరం వెంకీ పేర్కొన్నారు.

చివరిగా వేదికపై సల్మాన్‌ ప్రసంగించారు. ‘నమస్కార్‌.. హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు మాకు ఘన స్వాగతం చెప్పారు. రామ్‌ మాకు మద్దతుగా ఉన్నాడు.. అతడు నా చిన్న తమ్ముడు. తను, చిరు గారు నాకు చాలా దగ్గరి వ్యక్తులు. గత 25 ఏళ్లుగా ‘వెంకీ మామ’ (నవ్వుతూ) నాకు తెలుసు. ఆయన నా క్లోజ్‌ ఫ్రెండ్‌. మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. అందరూ సినిమా చూడండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ వేదికపై ఉన్న వారు ఎవరు లేకపోయినా.. ‘దబంగ్‌ 3′ సాధ్యమయ్యేది కాదు. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అన్నారు. అనంతరం ఆడియన్స్‌ కోరిక మేరకు సల్మాన్‌ తెలుగు ట్రైలర్‌లోని.. ‘ఆటకైనా, వేటకైనా రెడీ’ డైలాగ్‌ చెప్పారు.