Mega Star Chiranjeevi 152 Movie Acharya First Look And Motion Poster Will Be Released On August 22nd

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెగాస్టార్ ఆగ‌స్ట్ 22న త‌న 65వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులకు చిరంజీవి పుట్టిన‌రోజు గిప్ట్‌ను అందిస్తున్నారు. ఆగ‌స్ట్ 22 సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

నిర్మాత రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చిరంజీవి చేయి విప్లవానికి ప్రతీక అయిన ఎర్ర కండువాను పట్టుకుని ఉంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.