megastar Amitabh Bachan Director Teja Movie based on Article 370
megastar Amitabh Bachan Director Teja Movie based on Article 370

తేజ.. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ ఆయన..! చిన్న చిన్న సినిమాలతో మొదలైన ఆయన ప్రస్థానం.. ఒకానొక దశలో తెలుగులో టాప్ దర్శకుడి స్థాయిని అందుకుంది. చిత్రం, నువ్వు నేను, జయం.. ఇలా వరుస విజయాలు ఆయన చెంత చేరాయి. ఆ తర్వాత ప్రయోగాలు చేయడమో.. లేక టాలీవుడ్ కు కొత్త వాళ్ళను పరిచయం చేద్దామనో ఒకే రకమైన సినిమాలు తీశాడు. అందుకే అపజయాలు పలకరించాయి. ధైర్యం, ఒక వి చిత్రం, లక్ష్మీ కళ్యాణం, నీకు నాకు డాష్ డాష్.. ఇలా వరుసగా ప్లాప్ లతో సతమతమయ్యారు. జయం, నువ్వు నేను సినిమాలాగా తన సినిమాలు ఉండాలని అందరూ కోరుకున్నారని.. అందుకే తాను కూడా అలాంటి సినిమాలే తీశానని ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో కుండబద్దలుకొట్టినట్లు చెప్పుకొచ్చారు.

ఎప్పుడైతే ‘నేనే రాజు.. నేనే మంత్రి’ హిట్ ను తేజ అందుకున్నారో మరోసారి ఆయన వైపు నిర్మాతలు చూస్తున్నారు. మునుపటి తేజ కనిపించారంటూ చాలా మంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సీత సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా.. ప్రొడ్యూసర్లకు లాభాలను తెచ్చిపెట్టింది.

తేజ గురించి టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. అదేమిటంటే ‘ఆర్టికల్‌ 370’ నేపథ్యంలో సినిమా తీయబోతున్నాడంటూ..! సాధారణంగా ఇటువంటి సబ్జెక్టు ను బాలీవుడ్ దర్శకులు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆర్టికల్ 370 ఆధారంగా ఆయన ఓ కథ రాశారని ఫిలింనగర్ వర్గాల భోగట్టా..! ఈ సబ్జెక్టు ను బాలీవుడ్ జనాలు కూడా బాగా చూసే అవకాశం ఉన్నది. అందుకోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను సంప్రదించారట.. ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇది తేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాత తెరకెక్కించనున్నారట. గోవాలో ఈ కథకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ అతి త్వరలోనే రానుంది.