ఆచార్య టీజర్ వచ్చేసింది

0
452
megastar-chiranjeevi-acharya-teaser
megastar-chiranjeevi-acharya-teaser

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఈరోజు విడుదల చేసారు.

మరి ఇదిలా ఉండగా ఈ టీజర్ కొన్ని సర్ప్రైసింగ్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్ వాయిస్ ఓవర్ అలాగే చరణ్ గ్లింప్స్ షాట్ కూడా ఉంటుంది అనుకొన్నాం కానీ  చరణ్ క్యారెక్టర్ ని రివీల్  చేయలేదు . ఇందులో మెగాస్టార్ లుక్ ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చే విధంగా ఉంటుందనే నమ్మకం ఇస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

ఈ చిత్రాన్ని వేసవి రేస్ లో విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసారు. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు

Previous articleAcharya Official Telugu Teaser
Next articleMahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ locks release date