మొదలైన Chiranjeevi Acharya షూటింగ్ సందడి..!

0
85
Chiranjeevi and Ram Charan resume Acharya shooting

Chiranjeevi Acharya Shooting: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఒక సరికొత్త కథతో ఈ సినిమా చేస్తున్నాడు చిరూ (Chiranjeevi). ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ (Ram Charan) నటించడం. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే (Pooja Hegde) కనిపించనుంది.

క్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల ఆచార్య (Acharya) సినిమా కోసం ఓ సాలిడ్ స్టోరీని ఎంచుకున్నారని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.ఇటివలే కోకాపేటలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చింది.దీంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య షూటింగ్ (Acharya Shooting) కూడా ప్రారంభించారు.

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవితో పాటూ మిగిలిన నటీ నటులు కూడా సెట్స్ లో అడుగుపెట్టారు.ఇక వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులు ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Chiranjeevi and Ram Charan, Pooja Hegde, kajal Aggarwal resume Acharya shooting

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి లుసిఫార్ రీమేక్ (Lucifer Remake) షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohan raja) ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ఫైనల్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి…!!