చిరంజీవి బర్త్‌డే స్పెషల్ క్రేజీ ఆప్‌డేట్‌..!

0
397
Megastar Chiranjeevi Birthday special movie updates

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిరు కోరిక, రిక్వెస్ట్ మేరకు మెగా అభిమానుల సంఘాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఆగస్ట్ 22న చిరంజీవి 66వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు, సినీ సెలబ్రెటీలు ప్లాన్‌ చేస్తున్నారు.

Megastar Chiranjeevi Birthday Special '#Chiru153' Supreme Reveal On August 21st

Chiru 153 నెవర్ బిఫోర్ ఫస్ట్ లుక్ పోస్టర్:

మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ తెలుగు రీమేక్ మూవీ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల అధికారిక పూజా కార్యమ్రాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో నయనతార ఒక కీలక పాత్ర చేయనుండగా యువ నటుడు సత్య దేవ్ మరొక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు చెప్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి రేపు సాయంత్రం 5 గం. 04 ని. లకు మెగాస్టార్ సుప్రీం రివీల్ పేరుతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేలా దర్శకనిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాక్.

Chiranjeevi with Director Bobby next #Chiru154 date locked

Chiru 154 బాబీ దర్శకత్వంలో చిరు అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి సంబంధించి కూడా అప్‌డేట్ రాబోతుంది. రేపు సాయంత్రం 4గం.ల 5ని.లకు అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఈ మెగా పోస్టర్ మీకు కచ్చితంగా గూస్ బంప్స్ ఇస్తుందని తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మా వైపు నుండి ఇచ్చే మెగా గిఫ్ట్ ఇదని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో సముద్ర తీరాన ఓ పడవ మీద యాంకర్ వేలాడుతూ ఉండగా.. అందులో దూరంగా మెగాస్టార్ షాడో ఇమేజ్ కనిపిస్తోంది.

Chiranjeevi and Meher Ramesh #Chiru155 Update Tomorrow

Chiru 155 మెగాస్టార్ తో మెహర్ రమేష్ సినిమా అప్డేట్

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా 22ఆగస్టు ఉదయం 9 గంటలకు #మెగా యూఫోరియా తో థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నామని మెహర్ రమేష్ బృందం సోషల్ మీడియాల్లో ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్- సీసీ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై అనీల్ సుంకర – రామబ్రహ్మం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #HBD మెగాస్టార్ చిరంజీవి అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఈ విషయాన్ని వైరల్ చేసారు.

Acharya Chiranjeevi Birthday Poster Released

ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేవాలయ భూముల వివాదాల పై మంచి మెసేజ్ తో పాటు యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీ గా కొరటాల దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్.