శర్వానంద్ .. ‘శ్రీకారం’ కోసం మెగాస్టార్, కేటీఆర్‌

255
Megastar Chiranjeevi Chief Guest For Sharwanand Sreekaram Pre Release event copy

హీరో శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై కొత్త దర్శకుడు కిషోర్ బి. తో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ విడుదలైనప్పటి నుంచి.. రైతుల కోసం ఈ చిత్రం రూపొందినట్లుగా టాక్‌ నడిచింది. వాస్తవిక సంఘటనలతోనే ఈ సినిమా రూపొందించినట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

ట్రైలర్‌ చూశాక ఫస్ట్‌ కాల్‌ నాకు చరణ్‌ నుంచి వచ్చింది. సినిమా పాయింట్‌ బాగుంది. నేను ఈ సినిమాను సపోర్ట్‌ చేయాలను కుంటున్నా అన్నారు. వెంటనే ఆయన చిరంజీవిగారికి చెప్పడం, చిరంజీవి గారికి కూడా మేం చూపించాం. 8న ఖమ్మంలో జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావడానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే కేటీఆర్‌గారికి ఫోన్‌ చేశాం. సపోర్ట్‌ చేసేందుకు ఆయన కూడా రెడీ అయ్యారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగబోయే ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు’ అని శర్వానంద్ వివరించారు.

మార్చి 3న సెన్సార్‌ పూర్తయింది. ఓ యువరైతు కథ. స్ట్రాంగ్‌ డైలాగ్స్, బలమైన ఎమోషన్స్‌తో సినిమాను చేశాం. మిక్కీజే మేయర్‌ మంచి సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రాగారు ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న సీన్స్‌కు అంతే డెప్త్‌గా ఇచ్చారు. ఈ సినిమాకు డైలాగ్స్‌ అనేవి పెద్ద ఎస్సెట్‌’ నిర్మాత అన్నారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.