రాజ్యసభ టికెట్ వార్తలపై మెగాస్టార్ క్లారిటీ..!!

Chiranjeevi Comments On Rajya Sabha Ticket: మెగాస్టార్ చిరంజీవి గురువారం ఏపీ ముఖ్యమంత్రి ని కలిసిన విషయం తెలిసిందే. ఏపీలో కొనసాగుతున్న నా సినిమా రేట్లు గురించి అలాగే థియేటర్ ల గురించి మాట్లాడినట్టు చిరంజీవి వివరించారు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలవడం లో వేరే ప్రయోజనాలు ఉన్నాయని పలు మీడియా సంస్థలు న్యూస్ ని ప్రచారం చేస్తున్నాయి.

అయితే ఈ చర్చ పై వస్తున్న కొన్ని నిరాధార, అవాస్తవాల పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా స్పందించడం జరిగింది. “తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.

అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అన్నారు.

Megastar Chiranjeevi Comments On Rajya Sabha Ticket
Megastar Chiranjeevi Comments On Rajya Sabha Ticket

సినిమా టికెట్స్ స‌హా సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ప‌లు సెక్టార్స్‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించాన‌ని వాటిని క‌మిటీకి సూచిస్తాన‌ని జ‌గ‌న్ త‌న‌తో చెప్పిన‌ట్లు చిరంజీవి తెలిపారు. ఎవ‌రూ అభ‌ద్ర‌త‌కు లోను కావ‌ద్ద‌ని, అన్నీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దిశ‌గానే అడుగులు వేస్తున్నామ‌ని చిరంజీవి తెలిపారు.

Related Articles

Telugu Articles

Movie Articles