మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నీకి 42 ఏళ్ళు..!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సరిగ్గా 42 యేళ్ల క్రితం ఇదే రోజు నటుడిగా పురుడు పోసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికే కాదు ఎలాంటి రంగంలో అయినా ఒక టార్గెట్ పెట్టుకుని ఒక రేంజ్ కు ఎదగాలని కష్టపడే వారందరికీ ఇన్స్పిరేషన్ కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్ అదేనండీ మన చిరంజీవి. ఈ మాటలు అనడంలో ఎటు వంటి అతిశయోక్తి కాదు.

Megastar Chiranjeevi Emotional Tweet about his film journey starts at 42 years back 22 september 1978

స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంచలంచెలుగా మాములు నటుడి నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు. 42 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నడు వెనక్కి తిరిగి చేసుకుంది లేదు. మధ్యలో హీరోగా గ్యాప్ వచ్చినా.. రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో హీరోగా తన స్టార్ రేంజ్ ఏంటో చూపించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో 42 ఏళ్లు పూర్తైయిన సందర్భంగా చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేసారు.

సౌత్ లో కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకున్న మొదటి నటుడిగా ఆయన ఆరోజుల్లోనే కొత్త రికార్డు క్రియేట్ చేశారు.ఈరోజు ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. అది కూడా సరిగ్గా నలభై రెండేళ్ళ క్రితం. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ప్రాణం ఖరీదు సినిమా నేటితో 42 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నన్ను ఇంతలా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులందరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసారు..

గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’తో ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాతో పలకరించబోతున్నాడు. గత నెల ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా 42 ఏళ్లు పూర్తైన సందర్భంగా చిరంజీవికి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిని ప్రముఖులు వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

Telugu Articles

Movie Articles