‘ఆచార్య’ మోషన్ పోస్టర్: బాస్ లుక్ సూపర్..

0
407
megastar chiranjeevi, koratala siva movie acharya first look motion poster released

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. ఆయన 152వ సినిమా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. కొరటాల సినిమా అంటే సోషల్ మెసేజ్ కూడా గ్యారంటీ. కాబట్టి, సినీ ప్రేమికులు సైతం ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. ధర్మస్థలి అనే ఊరు.. చుట్టూ జనం.. ఆ జనం మధ్య ఎర్రకండువా వేసుకున్న ఒక యోధుడు చేతిలో చిన్నపాటి ఆయుధంతో వేటాడుతున్నాడు. ఆ వేటగాడే ‘ఆచార్య’. ధర్మం కోసం పోరాడే కామ్రేడ్. చిరంజీవిని వెనకనుంచి చూపించా ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ‘ధర్మం కోసం ఒక కామ్రేడ్‌ చేసిన అన్వేషణ’ అంటూ కొరటాల శివ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

కాగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ అన్ని కుదురుకున్న తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఏడాది విడుదల చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

Previous articlePawan Kalyan Wrote A Emotional Letter To Chiranjeevi Birthday
Next articleAcharya First Look Motion Poster Released