megastar chiranjeevi new house reunion party
megastar chiranjeevi new house reunion party

ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పార్టీ హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లో సందడి సందడిగా జరిగింది. చాలా మంది అప్పటి స్టార్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ముఖ్యంగా నలుగురు స్టార్స్ మిస్ అవ్వడం కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

ఇంతకూ ఆ టాప్ స్టార్స్ ఎవరు అనే మీ డౌట్ కదా ఇంకెవరు ముఖ్యంగా మన నటసింహం నందమూరి బాలకృష్ణ కాగా.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్..! గతంలో వీరందరూ ఈ పార్టీలో బాగా సందడి చేశారు. కానీ ఈసారి చిరంజీవి కొత్త ఇంట్లో జరిగిన ఈ రీయూనియన్ కు వారు రాకపోవడం పార్టీలో కాస్త కల తప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా షూటింగ్ ల కారణంగానే వీరు రాలేకపోయారని తెలుస్తోంది.

బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, నాగార్జున మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. సుహాసిని, ఖుష్బూ, రాధిక, లిజీ, సుమలత ఆర్గనైజర్స్ గా ఉన్నారు. వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, శోభన, భాగ్యరాజ, శరత్ కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్ లు సందడి చేశారు.