Megastar Chiranjeevi Ready Take Responsibility For Sai Dharam Tej Marriage

chiranjeevi: Sai Dharam Tej: వరుసపెట్టి టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు పెళ్లి పీటలెక్కేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన హీరోలు తమ తమ లైఫ్ పార్ట్‌నర్స్‌ని వెతుక్కునే పనిలో ఉన్నారు. దగ్గుబాటి రానా – నితిన్ – నిఖిల్ సిద్ధార్థ్ లు ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు సీక్రెట్‌గా పెళ్లి పనులు చేస్తున్నారని టాక్.

కాగా సాయి ధరమ్ తేజ్ ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన తమ దగ్గరి బంధువుల అమ్మాయిని తేజ్ తో వివాహం చేయనున్నారట. ఇప్పటికే అమ్మాయిని చూసిన తేజ్ తల్లి.. ఈ సంబంధం గురించి మేనమామ మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారని.. ఈ సంబంధానికి చిరు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మెగా ప్లాన్ రెడీ చేసి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు వచ్చే ఏడాది వేసవిలో తన అల్లుడి పెళ్లి కోసం మెగాస్టార్ ఓ డేట్ కూడా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. మొత్తం మీద వచ్చే ఏడాది 33 ఏళ్ళ ధరమ్ తేజ్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడు.