megastar chiranjeevi tries a new look for one of the characters of his future films

Megastar Chiranjeevi New Look: మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో కానీ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు ఫ్యాన్స్ మధ్య ఉన్న అడ్డుగోడకు చెరిపేసారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుండు లుక్‌తో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.

ఈ లుక్ ఏ సినిమా కోసమో స్పష్టత లేదు కానీ.. చిరంజీవి మాత్రం ఈ గుండు లుక్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ట్రిమ్ చేసిన మీసాలు, గెడ్డం.. ఆపై బ్లాక్ గాగుల్స్ చిరంజీవిని హాలీవుడ్ హీరోలా మార్చేశాయి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి కొత్త లుక్.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ‘ఆచార్య’ సినిమా కోసమే.. నెక్ట్స్ చేయబోయే సినిమా కోసం టెస్ట్ లుక్ కోసం గుండ్ చేయించుకున్నాడా అనేది చూడాలి.

View this post on Instagram

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ఆచార్య’ తర్వాత మలయాళంలో హిట్టైన ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు.. తమిళంలో హిట్టైన ‘వేదాలం’ చిత్రాన్ని తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.