‘సరిలేరు నీకెవ్వరు’.. ల్యాండ్ మార్క్ ప్రకటన ఇదే

MegaStar Chiranjeevi will be gracing Mahesh Babu Sarileru Neekevvaru Pre Release Event on JAN 5th
MegaStar Chiranjeevi will be gracing Mahesh Babu Sarileru Neekevvaru Pre Release Event on JAN 5th

మహేశ్ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారనే ఊగాహానాలు సినిమా టీమ్ ఫుల్ స్టాప్ పెట్టింది. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. దీనిని కన్ఫర్మ్ చేస్తూ మహేశ్ బాబు కూడా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుంచి ల్యాండ్ మార్క్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని గురువారం చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ల్యాండ్ మార్క్ ప్రకటన ఏమై ఉంటుందా? అని అందరూ ఊహిస్తున్న తరుణంలో.. చిత్రయూనిట్ నుంచి ఆ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. చిత్రయూనిట్ అఫీషియల్‌గా శుక్రవారం తెలుపడంతో మెగా, మహేష్ అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మహేశ్ పలు సందర్భాల్లో కలవటం తప్ప ఆడియో ఈవెంట్లకు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ముఖ్య అతిధిలుగా వెళ్లటం జరగలేదు. తొలిసారిగా ఓ గ్రాండ్ ఈవెంట్ కు అందునా మహేశ్ సినిమాకు మెగాస్టార్ ప్రత్యేకంగా రావటం విశేషమనే చెప్పాలి.

దశాబ్దం క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా జల్సాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అప్పట్లో ఇదో సంచలనం. అంతకుముందు అర్జున్ సినిమా పైరసీ విషయంలో వరంగల్ లో జరిగిన ఘటనకు మహేశ్ కు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చాడు. ఇటివల భరత్ అను నేను సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చాడు. తర్వాత ఓ స్టార్ హోటల్ లో వీరికి చరణ్ కూడా జత కలిశాడు. ఇప్పుడు ఏకంగా చరణ్, ఎన్టీఆర్ ఓ మల్టీస్టారర్ సినిమానే చేస్తున్నారు. ఇటువంటి ఆహ్లాదకర సంఘటనలతో టాలీవుడ్ లో మంచి సహృద్భావ వాతావరణం నెలకొందనే చెప్పాలి.