రివ్యూ: డియర్‌ మేఘ

0
626
Dear Megha Telugu Movie Review and Rating

Dear Megha Telugu Movie Review and Rating
విడుదల తేదీ : సెప్టెంబర్ 03, 2021
రేటింగ్ : 2.75/5
నటీనటులు: మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల తదితరులు
దర్శకుడు: ఏ . సుశాంత్ రెడ్డి
నిర్మాత: అర్జున్ దాస్యన్
సంగీత దర్శకుడు: హరి గౌర
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి

విడుద‌ల‌కు ముందే పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన చిత్రం ‘డియ‌ర్ మేఘ‌’. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ‘దియా’కు రీమేక్‌గా రూపొందింది. టైటిల్ పాత్ర‌ను మేఘా ఆకాష్ పోషించ‌గా.. అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు క‌థానాయ‌కులుగా న‌టించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:
మేఘ స్వరూప్ (మేఘా ఆకాష్‌) కాలేజీలో త‌న సీనియ‌ర్ అర్జున్ (అర్జున్ సోమ‌యాజులు)ని ప్రేమిస్తుంది. త‌న మ‌న‌సులోని మాట‌ను అత‌నికి ఎన్నోసార్లు చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ, ధైర్యం చాల‌క ప్ర‌తిసారి ఆగిపోతుంటుంది. ఈలోపు అర్జున్ కాలేజీ వ‌దిలి సింగ‌పూర్ వెళ్లిపోతాడు. మూడేళ్ల త‌ర్వాత అర్జున్ ముంబ‌యిలో మేఘ ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. కాలేజీ రోజుల్లోనే తాను కూడా ప్రేమించిన‌ట్లు చెప్పి.. మేఘకు షాకిస్తాడు. త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో మునిగిపోతారు. మేఘ జీవితాన్ని తలక్రిందులు చేస్తోంది. ఆ పరిస్థితుల్లో మేఘాకి తారసపడతాడు ఆది (ఆదిత్ అరుణ్). ఈ ఇద్ద‌రి స్నేహం ప్రేమ‌గా మారుతున్న స‌మ‌యంలో అర్జున్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? అర్జున్ , ఆదిలలో మేఘ ఎవరి ప్రేమను పొందిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Megha Akash Dear Megha Review and Rating in Telugu

బ‌లాలు

మేఘ, అరుణ్‌ల నటన
పాటలు

బ‌లహీన‌త‌లు

కథ
నెమ్మదిగా సాగే కథనం

నటీనటులు:
ఈ కథను తమ భుజాలపై మోసికెళ్లారు మేఘ, అదిత్. మేఘ చక్కటి భావోద్వేగాలను పండించి మేఘ స్వరూప్ పాత్రకు ప్రాణం పోసింది. ఆద్యంతం ప్రేమను ఫీలయ్యే అమ్మాయిగా తనలోని సంఘర్షణను తెరపై ఆవిష్కరించింది. ఆదిత్ అరుణ్ కూడా ఆది పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. మరో కీలక పాత్రలో నటించిన అర్జున్ సోమయాజుల నటన పరంగా పర్వాలేదు అనిపించాడు. లక్కీ పాత్రలో నటించిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలో ఎప్పటిలాగే చేసుకుంటూపోయారు.

Megha Akash Dear Megha Review and Rating in Telugu

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు గౌర హరి అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగుంది. దర్శకుడు సుశాంత్ రెడ్డి టేకింగ్ బాగుంది. మాతృకను చెడగొట్టకుండా చిన్నచిన్న మార్పులతో కథనాన్ని చక్కగా తీర్చిదిద్దారు. హరిగౌర పాటలు, నేపథ్య సంగీతం డియర్ మేఘాకు బలాన్ని చేకూర్చాయి. ఆండ్రూ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. సాంకేతికంగా, నిర్మాణ పరంగా డియర్ మేఘా ఫర్వాలేదనిపిస్తుంది.

విశ్లేషణ:
”డియర్ మేఘ” అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వచ్చిన దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి, ఈ సినిమా క్లైమాక్స్ తో కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు. ఇక ప్రధాన పాత్రలో నటించిన మేఘా ఆకాష్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా బాగా ఆకట్టుకుంది. ఇదొక ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌. నిజానికి ఇలాంటి క‌థ‌లు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. కాక‌పోతే ఇందులో ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా క‌థానాయిక కోణం నుంచి న‌డిపించే ప్ర‌య‌త్నం బాగుంది.

Megha Akash Dear Megha Review and Rating in Telugu

ఎప్పుడూ సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలతో మరియు తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకునే ఆదిత్ అరుణ్ నుండి.. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది. వాస్త‌వానికి ఇలాంటి సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ల్ని ముట్టుకున్న‌ప్పుడు.. ఆ క‌థ‌లోని ఫీల్‌ను య‌థాత‌థంగా క్యారీ చేయ‌గ‌ల‌గ‌డం ఎంతో ముఖ్యం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కాస్త త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి.

మేఘ-అర్జున్‌ల లవ్ ట్రాక్ లో పెద్దగా ఫీల్ అనిపించదు. ఎప్పుడైతే ఆది మేఘ జీవితంలోకి వస్తాడో అప్పటి నుంచి కథనంలో వేగం పెరుగుతుంది. స్నేహితుల మధ్య ఆకర్షణ ప్రేమగా మారడం, ఆ ప్రేమను వ్యక్తపరుచుకోడానికి పడే తపన ప్రేమికులకు బాగా నచ్చుతుంది. ఇక ఆది – మేఘ లవ్ ట్రాక్ బాగున్నా.. వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి.

Megha Akash Dear Megha Review and Rating in Telugu

పైగా సినిమా స్లో నేరేషన్ తో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు బైక్ యాక్సిడెంట్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు. లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి.

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌..!
Next articleCheppake Cheppake Song From Maha Samudram Will Be Out On September 6