Meghamsh Srihari RajDooth Theatrical Trailer Talk
Meghamsh Srihari RajDooth Theatrical Trailer Talk, Cast Crew

 

రాజ్ దూత్…ఒకప్పడు బాగా ఫేమస్ అయిన ఈ టు వీలర్ పేరుతో శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా సినిమా రెడీ అయ్యింది.ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఇంప్రెసివ్ గా ఉంది.ఇది రొటీన్ స్టోరీ తో తెరకెక్కిన సినిమా కాదు అనే విషయాన్ని హీరో చెప్పిన ఫస్ట్ డైలాగ్ తోనే కన్వే చేశారు.అలా అని మరీ కొత్త కథ కూడా కాదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

కాస్త ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో కొత్త హీరోని లాంచ్ చెయ్యడానికి అవసరమయిన మెటీరియల్ మాత్రం సినిమాలో ఉంది అని ట్రైలర్ చెబుతుంది.హీరో మేఘాంశ్ కూడా కాస్త మెచూర్డ్ ఆర్టిస్ట్ లానే చేసాడు.ఎక్కడా తడబడినట్టు కనిపించలేదు.ట్రైలర్ ప్రకారం ఈ సినిమా మొత్తం రాజ్ దూత్ బండి చుట్టూనే తిరుగుతుంది.ఎక్కడో ఉన్న ఆ బండి తీసుకురావడానికి వెళ్ళిన హీరో అనుకోకుండా ప్రొబ్లెమ్స్ లో ఇరుక్కోవడం,అక్కడి నుండి తప్పించుకుని బయటపడడం అనే లైన్స్ లోనే నడుస్తుంది ఈ సినిమా.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే కొత్త కుర్రాడిని యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చెయ్యాలి లాంటి భారీ ఆలోచనలు చెయ్యకుండా ఫన్ రైడ్ జర్నీ లా ఈ మూవీ ని మలిచారు ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అర్జున్ అండ్ కార్తీక్.ఇక రాజ్ దూత్ కి సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.ఓవర్ ఆల్ గా చూస్తే మేఘాంశ్ కి పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ లా నిలిచేలా ఉంది రాజ్ దూత్.

[INSERT_ELEMENTOR id=”3574″]