meghana raj wife of late chiranjeevi sarja blessed with baby boy

Chiranjeevi Sarja: దివంగత కన్నడ నటుడు 36 ఏళ్ల వయసులోనే చిరంజీవి ఆకస్మిక మరణం కలిచివేసింది. అకాల మరణం చెందినప్పుడు ఆయన భార్య మేఘానా రాజ్ నిండు గర్భిణి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకర వార్తను చిరంజీవి తమ్ముడు, హీరో ధ్రువ సర్జా గురువారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తమ అన్నయ్యే మళ్లీ పుడుతాడు అంటూ చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా భావోద్వేగంతో అన్న మాట నిజమైంది. ఇప్పుడు ఆమెకు మగ బిడ్డ పుట్టడంతో అభిమానులు చిరంజీవి మళ్లీ పుట్టాడని ఆనందపడుతున్నారు. జూనియర్ చిరంజీవి వచ్చేశాడని సంబరపడుతున్నారు. హాస్పిటల్‌లో తన అన్నయ్య బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ధ్రువ సర్జా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.