బిగ్ బాస్ షోలో మలుపులు మెహబూబ్ ఔట్..?

0
462
Mehaboob Dilse To Get eliminated From The Bigg Boss Telugu 4 Show

హై-ఓల్టేజ్ డ్రామా, నాటకీయ మలుపుల మధ్య బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షో నుంచి మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నాడు. తాజాగా సమాచారం ప్రకారం మెహబూబ్ దిల్‌సే ఈరోజు రాత్రి ప్రసారంకానున్న ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. నేటి ఎపిసోడ్ కు సంబంధించి నిన్ననే చిత్రీకరణ పూర్తి చేస్తారు. కనుక ప్రతి వారం కూడా శనివారం రాత్రి సమయంకు లేదా ఆదివారం ఉదయం వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయమై లీక్ వచ్చేస్తుంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రేక్షకులు ఇదే చూశారు. అయితే, ఆదివారం మెహబూబ్‌ను నాగార్జున ఇంట్లో నుంచి బయటికి పంపనుండటం చూడబోతున్నారట.

ఈ వారం ఎలిమినేసన్ లో అభిజిత్.. హారిక.. మోనాల్.. సోహెల్.. అరియానా మరియు మెహబూబ్ ఉన్నారు. మెహబూబ్ సత్తా ఉన్న కంటెస్టెంట్. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో అతని సత్తాను ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. మెహబూబ్ ఇంచుమించుగా ప్రతి వారం నామినేట్ అవుతూ వస్తున్నాడు. అయితే, గత వారం మెహబూబ్ సేవ్ అయ్యి.. రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. అరియానా వెళ్లి పోయే అవకాశం ఉందని అంతా భావించినా కూడా ఆమెకు కూడా చిన్న ఎలిమెంట్ ఏదో కాపాడింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన లీక్ అన్ని కూడా నిజమే అయ్యాయి. కనుక ఇది కూడా నిజమే అయ్యి ఉంటుంది అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి ఈరోజుతో బిగ్ బాస్‌లో మెహబూబ్ ప్రస్థానం ముగియబోతోందని సమాచారం. నేటి ఎపిసోడ్‌లో హారిక, అరియానా, మోనాల్, సోహెల్ సేవ్ అయ్యి మెహబూబ్ ఎలిమినేట్ కాబోతున్నారన్నమాట.

Previous articleఫొటోటాక్ : మెగా ఫ్యామిలీలో మరో హీరో ?.. దీపావళి పండగను గ్రాండ్‌గా.. నిహారిక- చైతన్య
Next articleవిజయ్ ‘మాస్టర్’ టీజర్ అరాచకం.. న్యూ రికార్డ్