దర్శకుడు మెహర్ రమేష్ రిక్వెస్ట్, సోనుసూద్ యాక్సెప్ట్ !!!

0
17
meher ramesh request to sonu sood for remdesivir

సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ లో వెంకట రమణ అనే పేసెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరడం జరిగింది. కేవలం 24 గంటల్లో సోనూసూద్ మెడిసిన్స్ ను దర్శకుడికి అందజేశారు.

దర్శకుడు మెహర్ రమేష్ అడిగిన Tocilizumb 400 mg ఇంజక్షన్ ను నిన్న వైజాగ్ లో 12 లక్షలకు కొందరు కొన్నారు. వెంకట రమణ పేసెంట్ తాలూకా వారికి 5 లక్షలకు విక్రయిస్తామని చెప్పారు. నిజానికి దీని ధర బయట 40 వేలు. కానీ బయట ఇది దొరకడం లేదు. కొందరు ఇష్టానుసారంగా బ్లాక్ లో విక్రయిస్తున్నారు. బ్లాక్ లో కొనే స్థోమత అందరికి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అడిగిన వెంటనే సోనూసూద్ ఇంజక్షన్స్, మెడిసిన్స్ అందజేయడంతో వెంకట రమణ పేసెంట్ కు టైమ్ తో పాటు డబ్బు సేవ్ అయ్యింది.

సోనూసూద్ చేసిన సహాయానికి మెహర్ రమేష్ ట్వీటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనుసూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు తన వంతు సహకారం అందిస్తున్నారు.