పెళ్లిపై షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించిన మెహ్రీన్..!

Actress Mehreen Pirzada: తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ.. హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మెహరీన్‌.. ఇటీవల పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్‌కు పెళ్లి ఫిక్స్ చేసారు. అయితే మెహరీన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. భవ్య బిష్ణోయ్‌తో తను పెళ్లిపీటలు ఎక్కడం లేదని, నిశ్చితార్థంకు బ్రేకాఫ్ చెప్పినట్లుగా మెహరీన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

అయితే మేమిద్దరం ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ఇకపై భవ్య బిష్ణోయ్‌ మరియు అతని కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహ్రీన్ తేల్చి చెప్పింది. అయితే తన వ్యక్తిగత అంశంపై తాను తీసుకున్న నిర్ణయాన్ని తన అభిమానులు, శ్రేయోభిలాషులు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నట్టు మెహ్రీన్ పేర్కొంది.

ఈ విషయంపై ఇక నేను ఎటువంటి ప్రకటన చేయదలుచుకోలేదు. దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించి, అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను. ఇకపై నటిగా కొనసాగాలని భావిస్తూ.. నా తదుపరి ప్రాజెక్ట్‌లు అలాగే నటిగా మెప్పించేందుకు ఎదురుచూస్తున్నాను..’’ అని మెహరీన్ తన ట్వీట్‌లో పేర్కొంది.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles