సీనియర్ హీరోతో రొమాన్స్ కి ఓకే అన్న మెహరిన్..!

Mehreen Kaur: టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ప్రస్తుతం F3 మూవీ చేస్తుంది. కెరియర్ మొదట్లో మంచి హిట్ సంపాదించుకున్నా టాలీవుడ్ భామ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. మెహరిన్ (Mehreen Kaur) ఇప్పుడు సినిమాల వేటలో పడింది, అది పెద్ద హీరో నా చిన్న హీరో నా అని తేడా లేకుండా సినిమా చేసుకుంటూ పోతుంది.

ప్రస్తుతం మెహరీన్ ఒక సినిమా గాను 60 లక్షలు రెవెన్యూ రేషన్ తీసుకుంటున్న ఈ భామ ఒక సీనియర్ హీరో సినిమాకి దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం అందుతుంది. అది మరేదో సినిమా కాదు మన కింగ్ నాగార్జున (Nagarjuna) అప్ కమింగ్ మూవీ అయినా ‘ఘోస్ట్’ (The Ghost).

కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా జనవరి సంక్రాంతి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని తరవాత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తోన్న ‘ఘోస్ట్’ (The Ghost) సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పుడు హీరోయిన్ కొరత ఏర్పడింది.

Mehreen Romance with Nagarjuna Next The Ghost
Mehreen Romance with Nagarjuna Next The Ghost

మొదట కాజల్ (Kajal Aggarwal) ని ఎంపిక చేసిన సినిమా మేకర్స్, తరవాత కాజల్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత చాలా పేర్లు వినపడ్డాయి, కానీ చివరిగా సినిమా మేకర్స్ మెహ్రీన్ (Mehreen Kaur) ను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.

దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. అయితే మొదట కోటి రూపాయల రెమ్యునిరేషన్ అడిగేటప్పుడు మేకర్స్ వెనకడుగు వేశారు, కానీ ఇప్పుడు తను అడిగినంత పారితోషకం ఇస్తూ సినిమాలో తీసుకున్నట్టు తెలుస్తుంది. పైగా ఈ సినిమాలో ఆమె రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. మరి మెహరీన్ (Mehreen Kaur) ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి దేమో చూడాలి.

 

Related Articles

Telugu Articles

Movie Articles